
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ తాజాగా కనీసం 600 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ కంపెనీ సబ్సిడరీలయిన టాపర్ నుంచి 300 మందిని, వైట్‌హ్యాట్ జూనియర్ నుంచి 300 మంది ఉద్యోగులను తీసేసింది. టాపర్స్‌ను కొన్న తర్వాత సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లలోని ఉద్యోగులను కొనసాగించిన బైజూస్, మిగిలిన ఉద్యోగులను తొలగించింది. తిరిగి ఆఫీస్‌లకు రమ్మని కంపెనీ అడగడంతో ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య వెయ్యి మందికి పైగా వైట్‌హ్యాట్ జూనియర్ ఉద్యోగులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కంపెనీ మరో 300 మందిని తీసేసింది కూడా.