వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిందే.. ఇండియాలో బైజూస్ ఆఫీసులు క్లోజ్

వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిందే.. ఇండియాలో  బైజూస్  ఆఫీసులు క్లోజ్

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోని అన్ని కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించుకుంది. భవనాలకు రెంట్లు భరించే ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నాలెడ్జ్ పార్కు‌లోని ఐబీసీ వద్ద ఉన్న ప్రధాన కార్యాలయం ఒకటి మాత్రమే కొనసాగుతుందని వెల్లడించింది.  

ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిందేనని చెప్పింది. బైజూస్ కంపెనీకి ప్రస్తుతం భారత్‌లో 14 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు . వీరిలో 25 శాతం  మందికి ఇంకా ఫిబ్రవరి నెల జీతాలు అందలేదు.  మిగిలిన వారికి జీతాల్లో కొంత మొత్తాన్ని విడుదల చేసింది. కొంత మంది ఇన్వెస్టర్లు ఫండ్స్‌‌‌‌ను బ్లాక్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలియజేసింది.