బైజూస్‌‌‌‌ ఉద్యోగుల్లో పావు మందికే పూర్తి జీతాలు

బైజూస్‌‌‌‌ ఉద్యోగుల్లో పావు మందికే పూర్తి జీతాలు

న్యూఢిల్లీ: బైజూస్ తమ ఉద్యోగుల్లో 25 శాతం మందికి పూర్తి శాలరీని, మిగిలిన వారికి జీతాల్లో కొంత మొత్తాన్ని విడుదల చేసింది. తక్కువ శాలరీ అందుకుంటున్న ఉద్యోగులకు  ఫిబ్రవరికి గాను  పూర్తి శాలరీని ఇచ్చింది. ఫండ్స్‌‌‌‌ను ఇతర మార్గాల ద్వారా సేకరించామని ఉద్యోగులకు రాసిన లెటర్స్‌‌‌‌లో కంపెనీ మేనేజ్‌‌‌‌మెంట్ పేర్కొంది. కొంత మంది ఇన్వెస్టర్లు ఫండ్స్‌‌‌‌ను బ్లాక్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలియజేసింది. 

కాగా,  మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో అవకతవకలు జరుగుతున్నాయని, ఫౌండర్ బైజూ రవీంద్రన్, ఆయన ఫ్యామిలీని కంపెనీ నుంచి తొలగించాలని నలుగురు ఇన్వెస్టర్లు ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ లో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. బైజూస్ సేకరించిన 200 మిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూ చెల్లదని ప్రకటించాలని వీరు కోరారు. ఈ ఫండ్స్‌‌‌‌ను వేరు వేరు ఎస్క్రో అకౌంట్లలో ఉంచాలని, విత్‌‌‌‌డ్రా చేయొద్దని ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ ఆదేశించింది. ఏప్రిల్‌‌‌‌ 4 న నెక్స్ట్ హియరింగ్ చేపట్టనుంది.