ములుగు, వెలుగు: బైక్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని రాంసింగ్ తండాకు చెందిన అంగోత్ బాలు(63) వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. శనివారం ఉదయం బైక్ పై వరంగల్ జిల్లా నర్సంపేటకు వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. పందికుంట క్రాస్ వద్ద మూల తిరుగుతుండగా వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు స్పాట్ లో చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
