తాడ్వాయి, వెలుగు: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన ప్రకారం.. గోవిందపేట మండలం మోట్లగూడెం గ్రామానికి చెందిన కోటే సంతోష్(40). కాగా అతని భార్య నాగమణి భూపాలపల్లి ఏరియా ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్ గా చేస్తుండగా అక్కడే నివసిస్తున్నారు.
అతను ఆదివారం ఉదయం బైక్ పై మేడారంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు అర్ధరాత్రి తిరిగి వెళ్తుండగా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరాన భూపాలపల్లి వెళ్లే రూట్ లో బైక్ అదుపుతప్పి పక్కనే కంకర కుప్పపైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన సంతోష్ స్పృహా కోల్పోయాడు.
అటుగా వెళ్లే ప్రయాణికులు చూసి 108కు సమాచారం అందించగా వచ్చి ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించగా అప్పటికే సంతోష్ మృతి చెందాడని తెలిపారు. సోమవారం మృతుడు సంతోష్ భార్య నాగమణితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
