బైక్స్ మీద మోజుతో దొంగగా మారిన 17 ఏండ్ల పోరడు

బైక్స్ మీద మోజుతో దొంగగా మారిన 17 ఏండ్ల పోరడు

హైదరాబాద్ : బైకులను దొంగిలించడం..ఇష్టమొచ్చినట్టు నడపడం. రైజింగ్ చేసి పెట్రోల్ అయిపోగానే ఓ రూమ్ లో పడేయడం. ఇలా బైక్ రైజింగ్ మోజుతో 12 బైకులను దొంగిలించిన ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు.

మౌలాలికి చెందిన అబ్దుల్ అబూబకార్ అమాన్(17)కు బైక్ రైజింగ్ హాబీ. జల్సాలకు అలవాటు పడ్డ అబ్దుల్ బైక్ దొంగతనాలకు చేసి.. రైజింగ్ చేసిన వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. 4, 5 రోజులు రేజింగ్ లకు వాడి.. పెట్రోల్ అయిపోగానే బైక్ లను వదిలేస్తాడు. వాహన తనిఖీలో సుల్తాన్ బజార్ పోలీసులకు చిక్కాడు. ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. ఇతని వద్ద నుండి 15 లక్షల విలువ చేసే..  12 బైక్ లను రికవరీ చేసి.. కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్ లలో అబ్దుల్ పై 15 కేసులున్నాయని తెలిపారు పోలీసులు.