CAAతో రక్షణ కల్పిస్తాం

CAAతో రక్షణ కల్పిస్తాం

రిపబ్లిక్ డే తరువాత ఢిల్లీలో ప్రతి ఏటా నిర్వహించే…ప్రైమ్ మినిస్టర్స్ NCC క్యాడెట్స్ ర్యాలీ ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 2 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని క్యాడెట్ల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ..సీఏఏతో పొరుగు దేశాల్లో ఉన్న మైనార్టీల‌ను ర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. భార‌త్‌ కు స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్న‌వారు దేశ విభ‌జ‌న‌కు అంగీక‌రించార‌ని తెలిపారు.

మైనార్టీల‌కు ర‌క్ష‌ణ ఇవ్వాల‌ని నెహ్రూ-లియాక‌త్ ఒప్పందం స్ప‌ష్టం చేసింద‌ని, గాంధీజీ కూడా ఇదే కోరుకున్నార‌న్నారు. భార‌త్ ఇచ్చిన హామీని నేర‌వేర్చేందుకే సీఏఏ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు మోడీ తెలిపారు. ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న‌వారే సీఏఏను వ్య‌తిరేకిస్తున్నార‌న్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు మెడల్స్ అందజేశారు ప్రధాని మోడీ.