CAA ఏ ఒక్కరి పౌరసత్వాన్నో తొలగించడానికి కాదు

CAA ఏ ఒక్కరి పౌరసత్వాన్నో తొలగించడానికి కాదు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఏ ఒక్కరి పౌరసత్వాన్నో తొలగించడానికి కాదని.. పౌరసత్వాన్ని ఇవ్వడానికేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా శివారులో ఉన్న బేలూరు మఠంలో జరిగిన యువజన సదస్సులో మోడీ ప్రసంగించారు. సీఏఏను యువత అర్థం చేసుకుంటున్నదని, కానీ, రాజకీయం చేయాలనుకునే వారే దానిని అర్థం చేసుకోవడం లేదని ఈ సదస్సులో విమర్శించారు. సీఏఏపై ఎంతో స్పష్టత ఇచ్చినప్పటికీ కొంతమంది ప్రజలను అయోమయానికి గురి చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు

“వేరే దేశం నుండి వచ్చిన ఎవరైనా సరే.. భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తే ఇక్కడి పౌరులు కావచ్చని మనమందరం తెలుసుకోవాలి. CAA  అందులో ఒక సవరణ మాత్రమే. ఇతర దేశాలలో క్లిష్ట పరిస్థితులలో నివసిస్తున్న వారికి భారత పౌరసత్వం ఇచ్చే అవకాశాన్ని మేము కల్పించాం” అని మోడీ అన్నారు.