ఓలా క్యాబ్‌డ్రైవర్ అని నమ్మించి పిల్లలను ఎత్తుకుపోయాడు

ఓలా క్యాబ్‌డ్రైవర్ అని నమ్మించి పిల్లలను ఎత్తుకుపోయాడు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిడ్నాప్ కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిడ్నాప్ సంచలనం సృష్టించింది. ఈ ఉదయం ఆరుగురు కుటుంబ సభ్యులు ముంబై నుండి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్  నుంచి సిటీలోకి రావడానికి 2 క్యాబ్స్ బుక్ చేసుకున్నారు. అయితే గుర్తు తెలియని ఓ క్యాబ్ డ్రైవర్… తనది ఓలా క్యాబ్ అని నమ్మించి ముగ్గురు పిల్లలను తన కారులో ఎక్కించుకుని ఉడాయించాడు. పిల్లలు తెలివిగా… వెంటనే తల్లి తండ్రులకు ఫోన్ చేసి… కారు ఎటు వెళ్తుందో  చెప్పారు. తల్లి తండ్రులు మరో కారులో వెంబడించారు. శంషాబాద్ దగ్గర్లో ఆ కారును ఆపి.. డ్రైవర్ ను పట్టుకున్నారు. పిల్లలను కిందకు దింపిన డ్రైవర్… వాళ్లనుంచి తప్పించుకుని పారిపోయాడు. తమకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని… నిందితులను పట్టుకోవాలని… ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు బాధితులు. ఆ డ్రైవర్ ఎవరో… సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.