ఆపరేషన్ సిందూర్.. ప్రధాని ఇంట్లో కీలక సమావేశం

ఆపరేషన్ సిందూర్.. ప్రధాని ఇంట్లో కీలక సమావేశం

ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతావ్యవహారాల  కమిటీ భేటీ అయ్యింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , కేంద్రహోంమంత్రి అమిత్ షా  ఆపరేషన్ సిందూర్ వివరాలను  మోదీకి వివరిస్తున్నారు. అంతకు ముందు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో  డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహన్ తో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మోదీతో సమావేశమై ఆపరేషన్ సింధూర్ వివరాలను వివరించారు.

పాక్,పీవోకేలోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని  ఇండియన్  వెల్లడించింది. అర్థరాత్రి ఒంటి గంట 5 నిమిషాల నుంచి ఒంటి గంట 30 నిమిషాల వరకు దాడులు జరిగాయని చెప్పింది.  సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్రస్థావరాలను టార్గెట్ చేశామని వెల్లడించింది.  ఖచ్చితమైన ఇంటిలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామని చెప్పింది.  ఏ క్షణమైనా పాక్  దాడి చేసే అవకాశం ఉందని  తెలిపింది

Also  Read : ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. తొమ్మిది టెర్రర్ క్యాంపులపై

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఇండియా పాక్ సరిహద్దులోని 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో  100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇండియా దాడిని అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఇండియాకు ఏ క్షణంలోనైనా బుద్ధి చెబుతాం..ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది. 

మరో వైపు పాకిస్తాన్, ఇండియా దాడులను ప్రపంచం తట్టుకోలేదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. సంయమనంతో ఇరు దేశాలు సామరస్యంగా చర్చించుకోవాలని సూచించింది.