
- ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం
- మోదీకి ఆపరేషన్ సిందూర్ పై వివరిస్తున్న రాజ్ నాథ్ సింగ్,, అమిత్ షా
- ఆర్మీ ప్రెస్ మీట్ :
- సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్రస్థావరాలను టార్గెట్ చేశాం
- ఖచ్చితమైన ఇంటిలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశాం
- ఏ క్షణమైనా పాక్ దాడి చేసే అవకాశం ఉంది
- అర్థరాత్రి ఒంటి గంట 5 నిమిషాల నుంచి ఒంటి గంట 30 నిమిషాల వరకు దాడులు జరిగాయి.
ఆర్మీ ప్రెస్ మీట్ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం
ఆర్మీ ప్రెస్ మీట్ : సీమాంతర ఉగ్రవాదంలో 350 మంది భారతీయులు మృతి, 800 గాయాలు. 600 సైనికులు చనిపోతే ఒక వెయ్యి 400 సైనికులకు గాయపడ్డారు : ఇండియన్ ఆర్మీ - ఆర్మీ ప్రెస్ మీట్ : ఇకపై సరిహద్దుల్లోనే కాదు.. ఉగ్రవాదులు లేకుండా చేయటమే లక్ష్యంగా.. ఆపరేషన్ సిందూర్ చేపట్టాం : ఇండియన్ ఆర్మీ
- రక్షణ శాఖ : పహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ఫోర్స్ బాధ్యత తీసుకుంది. పాక్ ఉగ్ర సంస్థల కోసం TRF పని చేస్తుంది. TRF ద్వారా LET భారత్ లో దాడులు చేస్తోంది.
- రక్షణ శాఖ : దర్యాప్తు వ్యవస్థల ద్వారా ఉగ్ర దాడులకు పాల్పడిన వారిని గుర్తించాం. ఉగ్రదాడులపై అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తుంది.
- భారత్, పాకిస్తాన్ మధ్య తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్థత నెలకొంది.
- 120 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న క్రమంలోనే.. భారత్ లో పోటీల నిర్వహణ విషయంలో నిర్వాహకులు సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
- షెడ్యూల్ మార్పుపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
- పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు గర్వపడేలా చేస్తున్నాయి
- సీఎస్, డీజీపీ, స్థానిక మిలిటరీ అధికారులతో ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష
- అందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
- రెండు దేశాలు సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి
- టెర్రరిజం అంతం చేసేందుకు భారత్ చేసేది కరెక్టేనని ఇజ్రాయోల్ ట్వీట్
- ఆపరేషన్ సింధూర్ కు ఇజ్రాయోల్ మద్దతు
- పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకున్న భారత్
- 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం
- జైషే మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు
- బవహల్పూర్లోని జైషే మహ్మద్ స్థావరంపై బాంబులేసిన భారత యుద్ధ విమానాలు
- మురిద్కేలోనే 30 మందికి పైగా ఉగ్రవాదులు హతం
- ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్
- 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్ భూభాగంలో దాడులు జరిపిన భారత్
- ఉద్రిక్తలతో భారత్‌లోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత
- ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు
- 9 నగరాలకు విమానాల రాకపోకల రద్దు చేసిన ఎయిరిండియా
- ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు.
- భారత్ మెరుపుదాడులతో పాకిస్తాన్‌లో అలజడి
- లాహోర్, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత
- ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ
- వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పాక్ అధికారులు
- పాక్ పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు
- 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు
- ‘ఆపరేషన్ సిందూర్’: అర్ధరాత్రి 2 గంటల 46 నిమిషాలకు ‘భారత్ మాతా కీ జై’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్
- ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షం
- టెర్రర్ క్యాంపులను పేల్చేసిన అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్
- పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా తిరిగొచ్చేసిన ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు
- పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగిన యుద్ధ విమానాలు
- మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాల్లోకి లేచిన ఐఏఎఫ్ యుద్ధ విమానాలు
- ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు కౌంటర్ గా భారత్ ఉగ్రవాదంపై కన్నెర్ర చేసింది. పాకిస్తాన్‌పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది.
పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు.