కేబుల్ రెడ్డిగా సుహాస్‌‌

కేబుల్ రెడ్డిగా సుహాస్‌‌

సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు శ్రీధర్ రెడ్డి డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. షాలిని కొండేపూడి హీరోయిన్. శుక్రవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌‌ని మేకర్స్‌‌కి అందించారు. సుహాస్ మాట్లాడుతూ ‘శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. మరో రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌టైనర్’ అని చెప్పాడు. ‘ఒక టౌన్‌‌లో జరిగే కథ ఇది. ఆసక్తికరంగా ఉంటుంది. క్లీన్ ఎంటర్‌‌‌‌టైనర్’ అన్నాడు దర్శకుడు. ‘ఇరవై రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయబోతున్నాం’ అన్నారు నిర్మాతలు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.