
- అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలె
- రాష్ట్రాలకు కేంద్రం సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాలు అప్పులపై జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ, కాగ్ మరోమారు హెచ్చరించాయి. ముంబైలో గురువారం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ సెక్రటరీల సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, అప్పులు, క్యాష్ మేనేజ్మెంట్ ఇతర అంశాలు చర్చించారు. అప్పుల విషయంలో ప్లానింగ్ ఉండాలని ఆర్బీఐ గవర్నర్ రాష్ట్రాల సెక్రటరీలకు సూచించారు. పద్ధతిగా ఖర్చులు చేయడం, రాష్ట్రాల మార్కెట్ రుణాలు, గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్‌పై మీటింగ్‌లో చర్చించారు.