
హైదరాబాద్, వెలుగు: క్రిస్మస్ఈవ్, న్యూ ఇయర్‌కు ఫెస్టివల్స్‌కు సిటిజన్లు రెడీ అవుతున్నారు. క్రిస్మస్ లో భాగంగా అతి ముఖ్యమైంది కేక్ తయారీ. ఇప్పటి నుంచే ఫెస్టివల్ సందడి షురూ అయ్యింది. కేక్ మిక్సింగ్ ఈవెంట్లు ప్రముఖ హోటళ్లు, ఆర్గనైజేషన్ల ఆధ్వర్వంలో సెలబ్రేషన్లు జోష్ గా నడుస్తున్నాయి. క్రిస్మస్ కు కేక్ తయారీ ప్రోగ్రామ్ఎప్పటినుంచో కొనసాగుతుంది. టేబుల్ పై నల్ల ఎండు ద్రాక్ష, గోల్డెన్ ఆప్రికాట్, అంజీర్, ఖర్జూర, క్యాండిడ్ ఆరెండ్ పీల్, క్యాండిడ్ జింజర్, డ్రై చెర్రీలను వైన్ లతో కలుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వారం కిందట హైటెక్ సిటీలోని హోటల్ రాడిసన్ లో కేక్ మిక్సింగ్ ఈవెంట్ ఎంతో సందడిగా జరిగింది. హోటల్ మేనేజ్మెంట్, ప్రథమ్ ఫౌండేషన్ తో కలిసి నిర్వహించింది. ఆపిల్ మోహ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ మిక్ అండ్ మింగిల్ కేక్ మిక్సింగ్ ని నిర్వహించనుంది. ఇందులో 150మందికి పైగా సెలబ్రెటీలు, సోషలిస్ట్ లు, వీఐపీలు పాల్గొంటున్నారు.