గ్రూప్ 2, 3 పై ఏం చేద్దాం.. టీజీపీఎస్సీ సమాలోచనలు.. గ్రూప్1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, 3 పై పీటముడి

గ్రూప్ 2, 3 పై ఏం చేద్దాం.. టీజీపీఎస్సీ సమాలోచనలు.. గ్రూప్1 రిక్రూట్మెంట్  ఆలస్యంతో గ్రూప్ 2, 3 పై పీటముడి
  • అప్పీల్​కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్
  • గ్రూప్ 1 సర్వీస్​కు ఎంపికైనవాళ్లలో గ్రూప్​ 2, ​3కి ఎంపికైనవాళ్లు ఎందరున్నారనే వివరాలు సేకరణ
  • వీటి ఆధారంగానే రిక్రూట్​మెంట్, జాబ్ ​క్యాలెండర్​పై నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: 
గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్​ 2,3 పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై టీజీపీఎస్సీ సమాలోచనలు చేస్తున్నది. గ్రూప్ 1 రిక్రూట్​మెంట్​పూర్తయ్యాకే గ్రూప్​2,3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ అనుకుంది. గ్రూప్​1 కు ఎంపికైనవారిలో చాలా మంది గ్రూప్ 2,3కి కూడా సెలక్ట్​అవుతారని, అందువల్ల వరుసగా గ్రూప్‌‌‌‌1, 2,3 పోస్టులు భర్తీచేస్తే బ్యాక్​లాగ్​ సమస్య ఉండదని భావించింది. కానీ, ఇప్పుడు గ్రూప్​‌‌‌‌1వాయిదా పడడంతో గ్రూప్​2,3పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిషన్ ఆలోచిస్తున్నది. 

ప్రస్తుతం గ్రూప్1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్​జడ్జి తీర్పుపై డివిజన్​ బెంచ్​లో అప్పీల్​కు వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే గ్రూప్ 2,3 రిక్రూట్​మెంట్​పై టీజీపీఎస్సీ రివ్యూ చేయాలని భావిస్తున్నది.

స్టేట్​లో వరుసగా గ్రూప్1,2,3 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలనూ అలాగే ప్రకటించింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా.. 3.02 లక్షల మంది హాజరయ్యారు. దాంట్లో 1:50 రేషియాలో మెయిన్స్ కు 31,403 మందిని ఎంపిక చేస్తే.. 21,093 మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు. 

మెయిన్స్ ఫలితాలను మార్చిలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఫలితాల్లో అభ్యంతరాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యువేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో గ్రూప్2,3 నియామకాలపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై  టీజీపీఎస్సీ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. నిజానికి గ్రూప్​ 2,3 ఫలితాలను మార్చిలోనే రిలీజ్ చేసినా, గ్రూప్​ 1 రిక్రూట్ మెంట్ కోసం ఆ రెండింటి నియామకాలను సర్కారు ఆపేసింది.

వెయిటింగ్​లో గ్రూప్ 2, 3 అభ్యర్థులు..

రాష్ట్రవ్యాప్తంగా 783  గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15,16 తేదీల్లో జరిగిన పరీక్షలకు 5,51,855 మంది అప్లై చేసుకోగా.. 2,49,964 మంది అభ్యర్థులు 4  పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీరిలో 2,36,649 మందికి మార్చిలో టీజీపీఎస్సీ జనరల్ ర్యాకింగ్ లిస్ట్​ను కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రెండు విడుతల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయగా.. తాజాగా శనివారం మరోసారి మూడో విడుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతోంది. 

మరోపక్క రాష్ట్రంలో 1,388 పోస్టుల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో  గ్రూప్ 3 పరీక్షలు జరిగాయి. 5,36,400 మంది అప్లై చేయగా.. 2,67,921 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,49,557 మందికి మార్చినెలలోనే ర్యాంకులు (జీఆర్ఎల్​)  రిలీజ్ చేశారు. ఈ రెండు రకాల పోస్టుల భర్తీకి గ్రూప్​1తో లింకు ఉండటంతో.. వీటిని ఆపారు. దీంతో ఈ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

డేటా పరిశీలించాకే నిర్ణయం..

గ్రూప్ 1 పరీక్ష రాసిన చాలామంది గ్రూప్ 2, 3 పరీక్షలు రాశారు. దీంతో గ్రూప్​ 1 సర్వీస్​కు ఎంపికైన అభ్యర్థులలో గ్రూప్ 2, 3 పరీక్షల్లో కూడా అర్హత సాధించినవారు ఎంతమంది ఉన్నారనే వివరాలను టీజీపీఎస్సీ పరిశీలిస్తోం ది. ఈ మూడు పరీక్షలను ఎంతమంది రాశా రు? రెండు పరీక్షలు ఎంతమంది రాశారు? వారిలో ఎంతమంది రెండు, మూడు సర్వీసుల కు ఎంపికయ్యారు? అనే డేటాను తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ప్రధానంగా గ్రూప్1 లో ఎంపికైన వారిలో గ్రూప్2,3కి ఎంతమంది ఎంపి క అవుతారనే వివరాలను సమీక్షించాలని టీజీ పీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది. 

ఒకవేళ గ్రూప్1ను పట్టించుకోకుండా.. గ్రూప్2,3 నియా మకాలు చేపడితే.. వాళ్లు మళ్లీ  గ్రూప్ 1 కు ఎంపి కైతే అక్కడ రిజైన్​చేసే అవకాశం ఉంది. దీంతో గ్రూప్ 2,3లో భారీగా బ్యాక్ లాగ్ పోస్టులు ఏర్ప డే ప్రమాదం ఉంటుంది.  ఈ విషయంలో టీజీపీ ఎస్సీ ఆచితూచీ వ్యవహరిస్తోంది. ఒకవేళ గ్రూప్​1కి ఎంపికయ్యే చాన్స్​ ఉన్నవాళ్లు తక్కువ గా ఉంటే గ్రూప్​2,3 పోస్టులు భర్తీ చేయాలని, సంఖ్య ఎక్కువగా ఉంటే గ్రూప్​1పై ఏదో ఒకటి తేల్చుకునేదాకా పక్కనపెట్టాలని భావిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే.. జాబ్ క్యాలెండర్​పైనా నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని టీజీపీఎస్సీ లోని ఓ అధికారి ‘వెలుగు’కు వివరించారు.