క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాని పాలసీలను ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు!

క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాని పాలసీలను ట్రేస్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు!

న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ పాలసీలను క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోని వారిని గుర్తించే కొత్త టెక్నాలజీని క్యామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపాజిటరీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తీసుకొచ్చింది. పాలసీలను క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోని వారిని లేదా వారి నామినీలను ట్రాక్ చేయడానికి ‘పాలసీ జీని డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో క్లెయిమ్ కాని అమౌంట్ రూ. 25 వేల కోట్ల దాక ఉంటుందని క్యామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. చాలా కాలం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అడ్వాన్స్​డ్​ అల్గారిథమ్స్​, డిజిటల్ సెర్చింగ్ టెక్నాలజీలను వాడి అర్హులైన క్లెయిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన వారి) ని గుర్తిస్తామని పేర్కొన్నారు. 5 నుంచి 20 ఏళ్ల కిందట ఇష్యూ అయిన పాలసీ క్లెయిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తించడంలో 11–25 శాతం సక్సెస్ రేటును నమోదు చేశామని పేర్కొన్నారు. పాలసీ హోల్డర్లను లేదా నామినీలను గుర్తించడానికి కంపెనీలకు చాలా టైమ్ పడుతోందని, తమ టెక్నాలజీతో ఈ టైమ్‌ తగ్గుతుందని రవి కిరణ్ పేర్కొన్నారు.