
- మేము కూడా కర్నాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమో.. : కేటీఆర్
హైదరాబాద్: ‘‘బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో అభ్యంతరకర ట్వీట్ చేసినందుకే కన్నడ నటుడు చేతన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌సహా, మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా, ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నాం”అని మంత్రి కేటీఆర్ ట్వీట్‌చేశారు. బహుశా మేము కూడా కర్నాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమోనన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అంటే.. అబ్యూస్ చేసే హక్కు ఉన్నట్టు కాదని మంత్రి ట్వీట్‌చేశారు.