రైళ్లలో ప్రయాణించేటప్పుడు తరుచుగా ఎదురయ్యే సమస్య టికెట్ కొనుగోలు చేయడం.. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు వంటి రైళ్లలో ప్రయాణించేటప్పుడు టికెట్ కొనుగోలు చేయడంపై మన ఫేస్ లో క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ప్యాసింజర్ టికెట్ తీసుకుని ఇతర రైళ్లలో ప్రయాణించొచ్చా అనేది ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న.. అయితే టికెట్ల కొనుగోలు, రైళ్లు మారేటప్పుడు టికెట్ విషయంలో తీసుకోవాలని జగ్రత్తలు గురించి ఇండియన్ రైల్వే గైడ్ లైన్స్ అందిస్తోంది. ఇవి చాలామందికి తెలియవు. వాటి గురించి తెలుసుకుందాం.
భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే రవాణా సాధనం రైల్వే. సాధారణ కోచ్ లో ఉన్నా.. ఏసీలో ఉన్నా.. స్లీపర్ కోచ్ లో ఉన్నా లెక్కలేకంత మంది ప్రయాణికులు రోజూ రైళ్లపైనే ఆధారపడతారు. ఇండియన్ రైల్వే 2020లో 808.6 కోట్ల మంది ప్రయాణికులు గమ్యానికి చేర్చింది. దేశం కనెక్టివిటీలో కీలక పాత్ర నిర్వహించింది.
సాధారణంగా చాలా మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మరొక రైలుకు మారడానికి ఒకే సాధారణ టికెట్ ఉపయోగిస్తారు. ఒకే టికెట్ తో ఎన్నిసార్లు ప్రయాణం చేయవచ్చనే దానిపై భారతీయ రైల్వే నిర్దష్ణ మార్గదర్శకాలను సూచించింది.
ఎక్స్ ప్రెస్ లేదా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లో సాధారణ టికెట్ తో మరో రైలు ఎక్కడం అనుమతించబడదు. టికెట్ కొనుగోలు చేసిన రైలులో మాత్రమే ప్రయాణించాలి. ఇది ఖచ్చితమైన నిబంధన. ఒకే టికెట్ పై పలు రైళ్లు మారాలని చూస్తే జరిమానా భారీగానే ఉంటుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి జనరల్ టికెట్ తో ఒకే రైళ్లో మాత్రమే ప్రయాణించాలని ఇండియన్ రైల్వే చెబుతోంది.