కెనడా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ..సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిడాంబి శ్రీకాంత్

కెనడా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ..సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కిడాంబి శ్రీకాంత్

ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కెనడా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టాప్ సీడ్ చౌ టియెన్- చెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-–18, 21–-9 తో వరల్డ్ నంబర్ 6 ఆటగాడు టియెన్ (చైనీస్ తైపీ)పై వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచాడు.

 ఈ ఏడాది శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది రెండో సెమీఫైనల్.  మలేసియా మాస్టర్స్ ఫైనల్ చేరాడు.  సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్ జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కెంటా నిషిమోటోతో ఆడతాడు. మరో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిషిమోటో 21–15, 5– 21, 21–17తో ఇండియా షట్లర్ ఎస్. శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు.