
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 22 శాతం పెరిగి రూ.4,752 కోట్లకు చేరుకుంది. ఈ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,905 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.38,063 కోట్లకు పెరిగిందని కెనరా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
వడ్డీ ఆదాయం రూ.28,701 కోట్ల నుంచి రూ.31,003 కోట్లకు మెరుగుపడింది. బ్యాంకు నిర్వహణ లాభం రూ.7,616 కోట్ల నుంచి రూ.8,554 కోట్లకు పెరిగింది. గ్రాస్ఎన్పీఏలు గ్రాస్ అడ్వాన్సులలో 2.69 శాతానికి తగ్గాయి. గ్రాస్ఎన్పీఏలు లేదా మొండి బాకీలు గత సంవత్సరం ఇదే కాలంలో 1.24 శాతం నుంచి 0.63 శాతానికి తగ్గాయి.