సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్​రద్దు చేయాలె

సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్​రద్దు చేయాలె
  • అభ్యర్థుల డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​లో చైల్డ్ డెవలప్​మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), ఎక్స్​టెన్షన్ ఆఫీసర్ (ఈవో) పోస్టులకు ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షలను రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్​లో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తల్లి ఈ డిపార్ట్​మెంట్​లో జాబ్ చేస్తున్నారని.. అందుకే ఆ ఎగ్జామ్స్ పేపర్స్​ కూడా లీకై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. 

ఈ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు టీజేఎస్ చీఫ్​ కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని మంగళవారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందచేశారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఈ మెరిట్ లిస్టులో  టాప్ 9 ర్యాంక్ వచ్చిందని నాయకులకు వివరించారు. మెరిట్ లిస్ట్​లో పేర్లున్న వారిపై విచారణ జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.  ఈ పరీక్షలు రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామని, ఆమరణ దీక్షకు కూడా వెనుకాడబోమని రాష్ట్ర సర్కారును హెచ్చరించారు.