అవ్వతాతల పెన్షన్ కట్ చేయడం క్షమించరాని నేరం: రేవంత్ రెడ్డి

 అవ్వతాతల పెన్షన్ కట్ చేయడం క్షమించరాని నేరం: రేవంత్ రెడ్డి
  • కట్ చేసిన పెన్షన్లు పునరుద్ధరించాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మాటలు కోటలు దాటించడం… చేతలతో వాతలు పెట్టడం కేసీఆర్ నైజమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. లక్ష మంది అవ్వ, తాతల పెన్షన్ కోత విధించడం క్షమించరాని నేరం అని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

‘‘కొత్త పింఛన్లు లక్ష కట్.. ఒక్క నెల ఇచ్చి.. బంద్​ పెట్టిన సర్కార్​..’’ శీర్శికన ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన బ్యానర్ వార్తను రేవంత్ రెడ్డి తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. 360 సాఫ్ట్​వేర్​తో కొత్త లిస్ట్​ నుంచి పేర్లు తొలగించారని, కుటుంబంలో ఫోర్ వీలర్ బండి ఉన్నా, ఐదెకరాల పొలం ఉన్నా పింఛన్ రద్దు చేశారని.. టాటా ఏస్, ట్యాక్సీ కారు నడుపుకునే వాళ్ల కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటూ ‘వెలుగు’లో వచ్చిన కథనంపై రేవంత్ రెడ్డి స్పందించారు. మాటలతో కోటలు దాటించడం.. చేతలతో వాతలు పెట్టడం కేసీఆర్ నైజం అంటూ మండిపడిన రేవంత్ రెడ్డి కట్ చేసిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.