
పాలమూరు, వెలుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం క్యాన్సర్ కేర్ సెంటర్ వర్చువల్ ప్రారంభోత్సవాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్ రంగా అజ్మీర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేర్ సెంటర్ వర్చువల్ గా ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు అమరావతి, అసోసియేట్ ప్రొఫెసర్ బాలశ్రీనివాస్, ఆంకాలజీ డాక్టర్ రాహుల్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ప్రేరణ, మెడికల్ ఆఫీసర్ దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.