మీరు తీసుకునే ఆహారంలో ఇవి ఉంటే.. క్యాన్సర్ తో పోరాడతాయి

మీరు తీసుకునే ఆహారంలో ఇవి ఉంటే..  క్యాన్సర్ తో పోరాడతాయి

క్యాన్సర్​.. ఈ పేరు వినగానే భయం. ఒకప్పుడు దీనికి చికిత్స దొరకడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎలాంటి క్యాన్సర్​కైనా అధునాతన టెక్నాలజీతో ట్రీట్​మెంట్​లు అందుబాటులోకి వచ్చాయి. నివారణ మార్గాలు కనిపెట్టిన డాక్టర్లు ఆ సక్సెస్​ కోసం ఏళ్లుగా శ్రమించారు. అయితే నేడు అనేక మంది  క్యాన్సర్​ బారిన పడుతున్నారు. వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పటికీ సందేహపడుతుంటారు. ఈ ఆహార పదార్థాలు రోజూ డైట్​లో భాగంగా చేసుకుంటే క్యాన్సర్​ని సమర్థంగా ఎదుర్కోవచ్చు.  అవి..

  • గ్రేప్​ఫూట్స్​: ఈ పండ్లలో చాలా న్యూట్రిషన్స్​ఉంటాయి. ఇవి క్యాన్సర్​కి వ్యతిరేకంగా పోరాడటంతో ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది.
  • గ్రేప్స్​: ద్రాక్ష పండ్లలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు..  రిస్​వెర్టల్​బ్రెస్ట్​, లివర్​, స్టమక్, లింఫాటిక్ క్యాన్సర్​ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
  • గ్రీన్​టీ : కొన్ని స్టడీస్​ ప్రకారం.. గ్రీన్​టీ క్యాన్సర్​ బారి నుంచి  కాపాడుతుంది. కానీ ఇది కచ్చితంగా అని చెప్పలేం.
  • వెల్లుల్లి : వెల్లుల్లిలో ఉన్న సల్పర్​ కంపౌండ్స్​క్యాన్సర్​కి వ్యతిరేకంగా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటాయి. గార్లిక్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 
  • బ్రకోలి : ప్రొస్టేట్​, బ్రెస్ట్​, కలన్, ఓరల్ క్యాన్సర్ల నుంచి పోరాడేందుకు బ్రకోలి బాగా తోడ్పడుతుంది. ఇందులోని సల్పోరఫేన్ క్యాన్సర్​తో పోరాడుతుంది.
  • పాలకూర : పాలకూర తింటే కంటికి, ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసు. కానీ అది క్యాన్సర్​కి కూడా ఉపయోగపడుతుందనే విషయం తెలుసా. విటమిన్​ఏ క్యాన్సర్ తో పోరాడటమే కాకుండా.. కణాల గ్రోత్​ని  రెగులేట్ చేస్తుంది.
  • టమాట : టమాట లోని యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్​గుండె జబ్బులు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్​ ఎ, సి, ఈ ఉంటాయి. ఇవి క్యాన్సర్​కి బద్ధ శత్రువులు.
  • నారింజ : ఎన్నో రిసర్చ్​ల సారాంశం ప్రకారం. . నారింజలో ఉన్న సిట్రస్​ విటమిన్​ అనేక రకాల క్యాన్సర్ ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అందులో కలన్, లంగ్, ప్యాన్​క్రియాటిక్ క్యాన్సర్ లు ఉన్నాయి.
  • పసుపు : పసుపు రోగ నిరోధక శక్తి పెంచడానికే కాదు.. క్యాన్సర్​ ట్రీట్​మెంట్లో సైతం కీలకంగా వ్యవహరిస్తుంది. కణాలు డ్యామేజ్​ కాకుండా, క్యాన్సర్​ని నిదానంగా దూరంగా చేయడంలో, వ్యాధి వ్యాప్తి చెందకుండా అదుపు చేయడంలో పసుపు కీలకంగా వ్యవహరిస్తుంది.