సినీ కార్మికులకు క్యాన్సర్ పరీక్షలు: చిరంజీవి

సినీ కార్మికులకు క్యాన్సర్ పరీక్షలు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాలతో పాటు సామజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసేందే.చిరంజీవి బ్లడ్ బ్యాంక్(Chiranjeevi Blood Bank) స్థాపించి ఎంతో మందికి రక్తదానం చేస్తున్నారు.రీసెంట్ గా గచ్చిబౌలి లోని  స్టార్ హాస్పిటల్స్(Star Hospitals) ఓపెనింగ్ కి చిరు హాజరైన విషయం తెలిసేందే.

తాజాగా చిరంజీవి ట్రస్ట్(Chiranjeevi Trust), స్టార్ క్యాన్సర్ సెంటర్(Star Cancer Center) ఆధ్వర్యంలో సినీ కార్మికుల అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. క్యాన్సర్ కేర్ నిపుణులు అయినా స్టార్ హాస్పిటల్స్ MD డాక్టర్ గోపీచంద్(Gopichand) తో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్లడానికి చిరు భావిస్తున్నారు.ఇక మెగా అభిమానులు కూడా జులై 9 నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున చిరంజీవి బ్లడ్ బ్యాంకులో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చిరు తెలిపారు. విశాఖపట్నంలో జులై 16 న, కరీంనగర్ లో జులై 23న క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చిరు సూచించారు. ఇక ఈ మధ్య చిరు ఒక డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ ప్రారభించడానికి వెళ్లగా..అక్కడ పరీక్షలు చేయించుకునేలా సినీ కార్మికులకు 50 శాతం రాయితీని అడిగి తన గొప్ప మనసు చాటుకున్నారు.చికిత్స ఖర్చులు సైతం వెనుకాడబోమని తెలిపారు. 

మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మందికి మేలు కలుగుతుందని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.