నామినేషన్లకు ముహూర్తం ఎప్పుడుంది.. పండితులను అడుగుతున్న అభ్యర్థులు

నామినేషన్లకు ముహూర్తం ఎప్పుడుంది.. పండితులను అడుగుతున్న అభ్యర్థులు

నామినేషన్ వేసేందుకు పండితులను కోరుతున్న అభ్యర్థులు

నేరడిగొండ, వెలుగు: ఎన్నికల రేసులో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏ రోజు.. ఏ టైంకి నామినేషన్ వేస్తే బాగుంటుందో పండితులను సంప్రదిస్తున్నారు. ఏ రోజు నామినేషన్ వేస్తే గెలుస్తామన్నది కూడా తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. బంపర్ మెజార్టీతో గెలిచేలా మంచి రోజు చూసి.. ముహూర్తం ఫిక్స్  చేయాలంటూ అభ్యర్థులందరూ పండితులను కోరుతున్నారు. ఈనెల 3, 6, 9వ తేదీల్లో నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెప్తున్నారు. దీంతో ఆయా తేదీల్లోనే నామినేషన్లు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ALSO READ : ఎక్కడికక్కడ చెక్​ పోస్టులు.. 28వ తేదీ నుంచి 30 దాకా రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే