
గంజాయి చాక్లెట్స్, పౌడర్ ను విక్రయిస్తున్న కిరాణా దుకాణాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. పెద్ద ఎత్తున గంజాయి చాక్లె్ట్లు, గంజాయి పోడర్ ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ జగత్ గిరిగుట్టలో జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో గంజాయి విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 160 గంజాయి చాక్టెల్ ప్యాకెట్లు, 4 కిలోల గంజాయి పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దుకాణ యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో - గంజాయి చాక్లెట్స్ను కొలకత్తా కు చెందిన మోహన్ అనే వ్యాపారి రెగ్యులర్ గా సప్లయి చేస్తున్నట్లు తెలిపాడు. ఒక్కో ప్యాకెట్లో 40 చాక్లెట్లు ఒక్కో ప్యాకెట్ ధర రూ. 1,000 ఉన్నట్టు సమాచారం. చాక్లెట్లు విలువ రూ. 2లక్షల56 వేలు ఉంటుందని తెలుస్తుంది. ఘటనపై కుసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.