క్షమించండి అమ్మ : శ్రీచైతన్య స్టూడెంట్ లెటర్‌

క్షమించండి అమ్మ : శ్రీచైతన్య  స్టూడెంట్ లెటర్‌

నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో సూసైడ్ లెటర్ ను పోలీసులు గుర్తించారు. ఈ లెటర్ లో అమ్మా, నాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి అని సాత్విక్ రాసుకొచ్చాడు. మిమ్మల్ని బాధ పెట్టాలని తన ఉద్దేశం కాదని, కళాశాలలో ప్రిన్సిపాల్, కళాశాల ఇంఛార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్పష్టం చేశాడు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులను తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఉంటున్న హాస్టల్లో వీరు ముగ్గురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని కూడా సాత్విక్ పేర్కొన్నాడు. వీరి వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, తనను వేధించిన ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకోండి అని లెటర్ లో కోరాడు. చివరకు అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ సాత్విక్ సూసైడ్ లెటర్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.