కరోనా వైరస్ అభూత కల్పన కాదు: ఆంటోని ఫౌచి

కరోనా వైరస్ అభూత కల్పన కాదు: ఆంటోని ఫౌచి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు శ్వేతసౌధంలోని పలువురికి కరోనా సోకింది. అయితే ట్రంప్ మాస్క్ లేకుండా ఫొటలకు పోజులు ఇస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందిన అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి… కరోనా అభూత కల్పన అని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పౌచి వైట్‌హౌస్‌లో కరోనా కేసులను ముందే నివారించవచ్చని తెలిపారు. ఈ వారం వైట్‌ హౌస్‌ను చూడండని, అక్కడ జరుగుతున్నది వాస్తవమని తెలిపారు. ప్రతి రోజూ మరింత మంది కరోనా బారిన పడుతుంటారని, ఇది అభూత కల్పన కాదన్నారు. ఇది దురదృష్టకర పరిస్థితని… అసలు ఇది చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చని తెలిపారు. ట్రంప్‌కి కరోనా సోకినప్పటికీ ఆయన ప్రవర్తిస్తోన్న తీరు పట్ల విమర్శలు వస్తోన్న క్రమంలో పౌచీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.