Captain Vijayakanth: కెప్టెన్ విజ‌య్ కాంత్‌కు ప‌ద్మ‌భూష‌ణ్..మ‌ర‌ణానంత‌రం అవార్డులు పొందిన సినీ ప్ర‌ముఖులు వీళ్లే!

Captain Vijayakanth: కెప్టెన్ విజ‌య్ కాంత్‌కు ప‌ద్మ‌భూష‌ణ్..మ‌ర‌ణానంత‌రం అవార్డులు పొందిన సినీ ప్ర‌ముఖులు వీళ్లే!

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను నిన్న(జనవరి 25న) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు (జనవరి 25వ) తేదీన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఈ సారి (2024) సినిమా రంగం నుంచి ప‌లువురు ఈ అవార్డులకి ఎంపికయ్యారు.

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ వరించింది. అలాగే సీనియ‌ర్ న‌టి వైజ‌యంతీ మాల‌ ప‌ద్మ విభూష‌ణ్ సైతం అవార్డు సొంతం చేసుకుంది. ఇక మూడవ అత్యున్నత పురస్కారమైన ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్ మిథున్‌ చ‌క్ర‌వ‌ర్తి తో పాటు సింగ‌ర్ ఉషా ఉత‌ప్‌తో, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్యారేలాల్ శ‌ర్మ అందుకున్నారు.

ఇక వీరితో పాటు తమిళ్ స్టార్ హీరో, రాజకీయ నేత, దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ కి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించింది. ఆయన మ‌ర‌ణానంత‌రంఈ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు.  గత ఏడాది డిసెంబర్ 28న పలు ఆరోగ్య సమస్యలతో విజయ్ కాంత్ కన్నుమూశారు. ఇప్పుడు మరణానంతరం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై కుటుంబ సభ్యులు, తమిళ ప్రముఖులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమైనా ఘననివాళి ఇదంటూ అభిప్రాయ పడుతున్నారు. 

దేశంలో కళ రంగంలో కృషి చేస్తూనే..సామాజిక బాధ్యతతో అడుగులు వేసిన వారందరికీ అవార్డులు వరించడం పట్ల..తమ ఫ్యాన్స్ తో పాటు..సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

హీరో విజ‌య్ కాంత్ మాదిరిగా మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ అవార్డులు పొందిన కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఉన్నారు. వారిలో గానగంధర్వుడు ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం 2021లో ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. SPB చ‌నిపోయిన ఏడాది త‌ర్వాత అత‌డిని ప‌ద్మ‌విభూష‌ణ్‌ పురస్కారంతో కేంద్రం గౌర‌వించింది. ఇక ఆ తర్వాత ప్ర‌ముఖ సింగ‌ర్ వాణి జ‌య‌రాం 2023లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు ఎంపికైంది. అంతేకాదు..ఆమెకు అవార్డు ప్ర‌క‌టించిన కేవలం ప‌ది రోజుల వ్యవధిలోనే  అనుమానాస్ప‌ద రీతిలో క‌న్నుమూసింది.