ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం

బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. స్పీడ్ గా వస్తున్న కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. బనశంకరిలోని కత్రిగుప్పె జంక్షన్ లో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ విజువల్స్ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడిని అసిస్టెండ్ డైరెక్టర్ ముఖేష్ గా గుర్తించారు పోలీసులు. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు అధికారులు. ప్రమాదంలో కార్లు, బైక్ లు కూడా ధ్వంసమయ్యాయి. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు అధికారులు.