ట్యాంక్ బండ్‌‌పై పల్టీకొట్టిన కారు

ట్యాంక్ బండ్‌‌పై పల్టీకొట్టిన కారు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ఎన్టీఆర్ మార్గ్ వద్ద పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్నవాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీశారు.