కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో ఘటన

కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో ఘటన

యాదాద్రి, వెలుగు : బైక్‌‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వట్టి నితిన్‌‌ రెడ్డి (28), ఎండీ.సిజాయిద్‌‌ (28) బుధవారం రాత్రి హైదరాబాద్‌‌ నుంచి బైక్‌‌పై జనగామకు వెళ్తున్నారు. ఆలేరు దాటిన తర్వాత వెనుక నుంచి కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.