గండిపేట, వెలుగు: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం తుక్కుగూడ నుంచి నార్సింగి వైపు వెళ్తున్న ఓ కారులో అప్పా జంక్షన్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ నిఖిల్ వెంటనే వాహనాన్ని ఆపి కిందకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది
