ఎండకు పూర్తిగా కాలిపోయిన కారు

ఎండకు పూర్తిగా కాలిపోయిన కారు

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోణిలో రోకళ్లు పగుల్తాయంటారు పెద్దలు.. రోకల్లు పగులుడేమో కానీ.. హనుమకొండ జిల్లా కాకాజీ కాలనీలో  ఎండల దాటికి ఓ కారు దగ్ధమయ్యింది.  చెల్పూరుకు చెందిన కొలుగూరి శ్రీనివాస రావు అనే వ్యక్తి  హాస్పటిల్ పని కోసం తన కారులో సిటీకి వచ్చాడు.  రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి హాస్పిటల్ లోకి వెళ్లిండు. అరగంట తర్వాత వచ్చి చూసే సరికి కారులో మంటలు చెలరేగుతూ కనిపించాయి. అయి అప్పటికే  కారు సగానికి పైగా కాలిపోయింది.  స్థానికులు నళ్లా నీళ్లతో మంటలను ఆర్పేశారు.  

రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావారణ శాఖ హెచ్చరించింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో  45డిగ్రీల వరకు నమోదయ్యింది.  జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా ఎండ మంట తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం ఓజోన్ పొర కరుగుతుండటంతో సూర్యుడినుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు భూమిపైకి చేరుతుండటంతో రేడియేషన్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.