మంటల్లో కారు.. అగ్నికి ఆహుతి

మంటల్లో కారు.. అగ్నికి ఆహుతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో అగ్నిప్రమాదంతో కారు దగ్ధమైంది. TS 07UC 8997 నెంబరు గల కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు అగ్నికి ఆహుతైంది. రోడ్డుపైన కారు దగ్ధం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపు కాలేదు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది  మంటలను అదుపు చేశారు. కారులో మంటలు ఎలా చెలరేగాయి. సాంకేతిక కారణాలతోనా..లేక మరేదైనా ప్రమాదమా అని తెలియాల్సి ఉంది.