రోడ్డుపై తగలబడ్డ కారు..ఫైరింజన్ వచ్చే లోపే..

 రోడ్డుపై తగలబడ్డ కారు..ఫైరింజన్ వచ్చే లోపే..

సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్ నిలయం వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. కారులో ఉన్నవారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.