తెల్లారితే ప్రమాదాలు.. నల్గొండలో హైవేపై తగలబడిన కారు.. ఏపీలో పెళ్లి కారు బీభత్సం !

తెల్లారితే ప్రమాదాలు.. నల్గొండలో హైవేపై  తగలబడిన కారు.. ఏపీలో పెళ్లి కారు బీభత్సం !

నల్గొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి 65పై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు డివైడర్ను ఢీ కొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. దీంతో.. కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది స్పాట్కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు రోడ్డుకు అడ్డం పడడంతో హైవే పై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, టోల్ సిబ్బంది ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు.

ఏపీలో కూడా శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర హైవేపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి వున్న విద్యార్థుల పైకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్ డెడ్ కాగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఫ్రంట్‌ టైరు పేలడంతో అదుపు తప్పి విద్యార్థుల పైకి కారు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.