
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్ బ్లాస్ట్ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
ఆసిఫ్ నగర్ లో ఉంటున్న మహబూబ్ ఇక్బాల్ గురువారం మధ్యాహ్నం తన స్నేహితురాలితో కలిసి కారులో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వస్తుండగా…కేబుల్ బ్రిడ్జిపై కారు అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బోల్తా పడిన కారు ను పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.