బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం..భారీగా ట్రాఫిక్ జామ్

బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి వస్తోన్న కారు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 

కారు ప్రమాదంతో బేగంపేట ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  ప్రమాదానికి గురైన కారును జేసీబీ సాయంతో పక్కకు తొలగించి  ట్రాఫిక్ క్లియర్  చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.