హైదరాబాద్లో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వర్షానికి అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం

హైదరాబాద్లో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వర్షానికి అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం (ఆగస్టు 19) ఉదయం పాతబస్తీలో వేగంగా వచ్చిన కారు కాలువలో పడిపోవడిపోయింది. భారీ వర్షాల కారణంగా  పాతబస్తీలోని బాబా నగర్ లో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. 

ప్రామాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. కారులో ఉన్న ముగ్గురిని అతి కష్టం మీద బయటకు తీశారు స్థానికులు. కారులో ఉన్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

అతివేగం కారణంగా స్కిడ్ అవ్వడంతో కారు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. వర్షాల కారణంగా కారు కంట్రోల్ కాకపోవడంతో కాలువలోకి దూసుకెళ్లినట్లు చెప్పారు. 

►ALSO READ | కూకట్పల్లి సహస్రను చంపింది ఇతడేనా..? అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మరోవైపు సోమవారం రాత్రి గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ కరెంటు షాక్ తో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. బండ్లగూడలో భారీ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు వైర్లకు తగలటంతో ఇద్దరు అఖిల్, వికాస్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఒవైసీ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిల్, వికాస్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు.