శివ భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. మధ్యప్రదేశ్‌‌‌‌లో ఘటన

శివ భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. మధ్యప్రదేశ్‌‌‌‌లో ఘటన

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌‌‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్వాలియర్ జిల్లాలో వేగంగా వచ్చిన కారు కన్వరియాల(శివ భక్తులు) మీదికి దూసుకెళ్లింది. దీంతో నలుగురు భక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా – ముంబై నేషనల్ ​హైవేపై శివపురి లింక్ రోడ్డులో బుధవారం (జులై 23) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

భదావనాలోని ఒక శివాలయంనుంచి గంగాజలం సేకరించి సిమారియా గ్రామానికి తిరిగి వస్తున్న కన్వరియాల బృందాన్ని అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. టైరు పేలడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి,  కన్వరియాలను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కన్వారియాలు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.