
వికారాబాద్, వెలుగు: పొగమంచు కారణంగా కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్‌జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కారు(ఏపీ 37ఏటీ5000)లో ఐదుగురు వ్యక్తులు అనంతగిరి గుట్టకు బయలుదేరారు. పొగమంచు ఎక్కువ ఉండడంతో రోడ్డుపై ఏమీ కనిపించక కారు అదుపుతప్పి.. వికారాబాద్సమీపంలోని శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లింది.
కారులో నుంచి మదాల మోహన్, రఘు కోమర, సాగర్ కోమర, పూజిత సురక్షితంగా బయటపడగా.. గుణశేఖర్(24) గల్లంతయ్యాడు. రెస్క్యూ టీమ్ 11 గంటల పాటు శ్రమించి గుణశేఖర్మృతదేహాన్ని బయటకు తీసింది. ప్రమాదం జరిగిన టైమ్ లో కారును మోహన్నడుపుతున్నట్టు వికారాబాద్ సీఐ టంగుటూరు శ్రీను తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఘటనా స్థలాన్ని స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్, వికారాబాద్ జిల్లా పరిషత్చైర్పర్సన్పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ పరిశీలించారు.