Health: డయాబెటిస్, హార్ట్ పేషెంట్లకు..సూపర్ ఫ్రూట్ ఈ పండు.. క్లినికల్ డైట్ నిపుణులే చెబుతున్నారు

Health: డయాబెటిస్, హార్ట్ పేషెంట్లకు..సూపర్ ఫ్రూట్ ఈ పండు.. క్లినికల్ డైట్ నిపుణులే చెబుతున్నారు

పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికి తెలుసు.. అయితే ఏ పండు తింటే ఏయే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనేది కొంత సందేహం కలిగించే విషయం..ముఖ్యంగా గుండె ఆరోగ్యం, డయాబెటిస్ ఉన్న వారు తీసుకోవాల్సిన పండ్లు ఏంటో అనేక సందేహాలున్నాయి.. అలాంటి వారికోసం క్లినికల్ డైట్ నిపుణులు చెబుతున్న అద్బుతమైన పండు దానిమ్మ..

దానిమ్మ (Pomegranate).. సూపర్ ఫ్రూట్ అనే పదం దీనికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ పండు గుండె ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనాలు అందించే పండు. ఈ విషయాన్ని క్లినికల్ డైటీషీయన్లే చెబుతున్నారు. దానిమ్మ దాని పాలిఫెనాల్ సమ్మేళనాల ద్వారా గుండె ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఉండే టానిన్లు, ఆంథోసైనిన్లు, ఇతర పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరమంతా ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి గుండె కణాలు, రక్తనాళాలు ఆక్సీకరణ ఒత్తిడి దెబ్బతినకుండా కాపాడుతాయి. 

విభిన్నమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పండ్లకంటే దానిమ్మలోఎక్కువగా ఉంటాయి. ఇవి సమర్థవంతంగా ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకునేందు సాయపడతాయి.దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు ధమని గోడలను దెబ్బతినకుండా కాపాడతాయి. ధమనులు గట్టపడటానికి అవి మూసుకుపోవడానికి కారణమయ్యే అథెరోస్క్లరోసిస్ డెవలప్ కాకుండా నిరోధించడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు సాయపడతాయి. 

దానిమ్మ ఎలా తింటే మంచిది.. 

మంచి ఫలితాలు పొందాలంటే ప్రతి ఒక్కరూ 3నుంచి 4 వారాల పాటు ప్రతి రోజు 250ml దానిమ్మ రసం తీసుకోవాలని డైటీషియన్లు చెబుతున్నారు. 

ప్రయోజనాలు.. 

రక్తప్రసరణ.. గుండె సరిగ్గా పనిచేసేందుకు రక్త ప్రసరణ అవసరం. దానిమ్మ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వాస్కులర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఎండోథెలియల్ లైనింగ్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది రక్తనాళాల సంకోచానికి, పనితీరుకు వీలుకల్పిస్తుంది. తద్వారా రక్తం సాఫీగా ప్రవహించి గుండె నొప్పికి కారణాలను తగ్గిస్తుంది. 

►ALSO READ | Beauty Tips : నల్ల జుట్టుకు నేచురల్ ట్రీట్ మెంట్ చేసుకోండి.. షాంపూల కంటే బెటర్ గా ఉంటుంది..!

డయాబెటిస్ పేషెంట్లకు..

గుండె జబ్బ ఉన్న రోగులకు డయాబెటిస్ వచ్చినప్పుడు వారికి వైద్యం అందించడం మరింత క్లిష్టంగా మారుతుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు దాని సహజ చక్కెరలతో కలిసి డయాబెటిక్ రోడులకు గుండె ప్రయోజనాలను అందిస్తాయి. డయాబెటిక్ రోగులకు వారి కాలెస్ట్రాల్ ప్రొఫైల్ ను పెంచడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలను తగ్గించడం సాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

దానిమ్మలో లభించే సహజ సమ్మేళనాలు డయాబెటిస్, గుండెజబ్బులను నియంత్రించే వ్యక్తులకు ప్రమాదరహిత, ప్రయోజనాలను మంచి ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు డైటీషీయన్లు.