Beauty Tips : నల్ల జుట్టుకు నేచురల్ ట్రీట్ మెంట్ చేసుకోండి.. షాంపూల కంటే బెటర్ గా ఉంటుంది..!

Beauty Tips : నల్ల జుట్టుకు నేచురల్ ట్రీట్ మెంట్ చేసుకోండి.. షాంపూల కంటే బెటర్ గా ఉంటుంది..!

చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు జుట్టు అందంగా ఉండాలని.. నల్లగా అందంగా ఉండాలని జనాలు  తెగ ఆరాట పడుతున్నారు.  కాని ఇప్పుడు యూత్​ కు ఉండే ఒత్తిడి.. నైట్​ షిఫ్ట్స్​ ..ఇతర కారణాలతో  ఆరేళ్లకే .. అరవై ఏళ్ల వాళ్ల మాదిరిగా జుట్టు తెల్లబడుతుంది. దానికోసం జనాలు అనేక  కాస్ట్లీ షాంపూలు.. అనే బ్యూటీ ఫార్లర్లకు వెళ్లి డబ్బులు తగలేస్తుంటారు.  అయినా ఒక్కోసారి ఎలాంటి ఫలితం ఉండదు.  అందుకే.. పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా... ఇంట్లోనే హోంటిప్స్​ తో జుట్టును నల్లగా.. అందంగా తయారు చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు  బ్యూటీ టిప్స్​ ను తెలుసుకుందాం. . . . 

ఫ్యాషన్ పేరుతో జుట్టుకు ఎన్నిరకాల రంగులేసినా.. నలుపు రంగే అందంగా ఉంటుంది. అయితే ఈరోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, నైట్ షిఫ్ట్ డ్యూటీలు వంటి మారిన లైఫ్ స్టయిల్​ తో  ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ఒకటి చిన్న వయసులోనే తెల్ల జుట్టురావడం. అంతేకాదు, జుట్టు రాలే సమస్యతోనూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కెమికల్స్ తయారు చేసిన షాంపూ, క్రీమ్స్, జెల్స్ వాడటం వల్ల కూడా జుట్టు నలుపురంగును కోల్పోతుంది. ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే నేచురల్ టిప్స్ ని పాటించాలి

ఈ మధ్య ఎంతోమందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు కనిపించడం మొదలవుతోంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా వస్తే, మరికొందర్లో పోషకాహార లోపం వల్ల వస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. దీనికోసం వేలకువేలు ఖర్చు చేసి మరీ బ్యూటీ సెలూన్లకు వెళ్తున్నారు. అలాకాకుండా ఇంట్లోనే కొన్నిరకాల చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. వాటితో జుట్టును ఒత్తుగా, సల్లగానూ మార్చుకోవచ్చు.

అశ్వగంధ : ఆయుర్వేద చికిత్సలో జుట్టు పెరుగుదలకు చాలా మార్గాలున్నాయి. అశ్వగంధ అన్నిరకాలుగా తోడ్పడుతుంది. ప్రతి ఆయుర్వేద షాపుల్లో అశ్వగంధ పొడి దొరుకుతోంది. ఒక గిన్నెలో కొబ్బరి నూనె, అశ్వగంధ పొడి వేసి బాగా కలపాలి. దాన్ని పది నిమిషాలు నానబెట్టి జుట్టుకు...  మాడుకు పట్టించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా, ముదురు రంగులో పొడవుగా పెరుగుతుంది.

 వేడి నూనె : జుట్టుకు ఒక నెల పాటు నూనె రాయకపోతే, జుట్టు గోధుమ రంగులోకి రావడం మొదలవుతుంది. అందుకే రెగ్యులర్​ గా జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం. అది కొబ్బరి నూనె... ఆముదం... ఆల్మండ్ ఆయిల్... ఏదైనా సరే తరచూ వాడాలి. అలాగే నూనెను వారానికి రెండుసార్లు వేడి చేసి తలకు రాసి మసాజ్ చేయాలి. నూనె మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మర్దనా చేయాలి. ఇది జుట్టును ఆరోగ్యంగా, నల్లగా ఉంచుతుంది.

కరివేపాకు ఆయిల్ మసాజ్: జుట్టు నల్లరంగులోకి రావడానికి ఉపయోగించే ముఖ్యమైన మూలికల్లో కరివేపాకు ఒకటి. ప్రతి వంటలో కరివేపాకును వాడుతుంటారు కాబట్టి అందరి ఇళ్లలో తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని రెండు రోజులు ఎండలో పెట్టాలి. ఆకులు పూర్తిగా ఎండాక పొడి చేసుకోవాలి. ఒకటీ స్పూన్ చొప్పున కొబ్బరి నూనెలో వేసి పదినిమిషాలు మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకు పొడిని నూనెలో మరిగించి నిల్వ కూడా చేసుకోవచ్చు.

మందారంతో ముదురు రంగు: తెల్లజుట్టు ముదురు రంగులోకి మారడానికి ఈ మందార నూనె బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మందార పువ్వులను వేడి నూనెలో వేసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత జుట్టుకు రాయాలి. ఇలా తరచూ చేస్తే తెల్ల జుట్టు ముదురు రంగులోకి మారుతుంది.
 మరో జాగ్రత్త: అలాగే ఎండలో బయటికి వెళ్లేటప్పుడు జుట్టును స్కార్ఫ్ లేదా టోపీతో కవర్ చేసుకోవాలి. లేదంటే సూర్యరశ్మి తాకిడికి కూడా జుట్టు రంగు మారే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.