హైదరాబాద్ సిటీ, వెలుగు: అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా(ఏహెచ్‌పీఐ) ముంబైలో నిర్వహించిన ఏహెచ్‌పీఐ గ్లోబల్ కాన్‌క్లేవ్ – 2026లో కేర్ హాస్పిటల్స్‌కు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్‌కు ఎక్సలెన్స్ ఇన్ క్వాలిటీ – బియాండ్ అక్రెడిటేషన్ తో పాటు పేషెంట్- సెంట్రిక్ హాస్పిటల్ అవార్డు దక్కింది.
హైటెక్ సిటీ యూనిట్‌కు నర్సింగ్ సేవల్లో ఉన్నత ప్రమాణాలకు గుర్తింపుగా ఏహెచ్‌పీఐ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ ప్రదానం చేశారు. అవార్డులు రావడంపై కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
