Careful: ఈ ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినకండి.. ఫుడ్ పాయిజన్ ఖాయం

Careful: ఈ ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినకండి.. ఫుడ్ పాయిజన్ ఖాయం

సురక్షితంగా ఉన్నంత వరకు, చెడుగా మారనంత వరకు మిగిలిపోయిన ఆహారం తినడం ఎప్పుడూ అనారోగ్యాన్ని దరిచేరనీయదు. కానీ కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాటిలోని కొన్ని ట్యాక్సిన్లు విడుదలై వాధి కారకాలుగా మారతాయని వారు అంటున్నారు.

బంగాళదుంపలు :

బంగాళాదుంపలను మళ్లీ వేడి చేయడం వలన లోపల ఉండే పిండి పదార్ధం అప్పటికే గది ఉష్ణోగ్రతలో ఉడికి ఉంటుంది. ఫలితంగా అందులోని క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే ప్రాణాంతక ప్రాణాంతక టాక్సిన్ బోటులిజంకు దారి తీస్తుంది. ఇది నరాలు, వెన్నుముక, మెదడుపై దాడి చేసి పక్షవాతానికి దారితీస్తుంది. బంగాళా దుంపలను వెన్న, పాలు, మీగడ వంటి పాడైపోయే పదార్థాలలో గుజ్జు చేస్తే, అది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

బచ్చలికూర:

బచ్చలికూరను సరిగ్గా వేడి చేయకపోతే లిస్టిరియోసిస్, ఫ్లూ వంటి లక్షణాలు తలెత్తుతాయి.  మెడ పట్టేయడం, జ్వరం, తలనొప్పితో పాటు కొన్నిసార్లు మూర్ఛలను కలిగించే ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపిస్తుంది. ఈ తరహా బాక్టీరియా ఆహార పదార్థాల్లో ఉంటుంది.

అన్నం :

చాలా మంది మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ వేడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వేడిని తట్టుకుని ఉండే వ్యాధికారక క్రిములు దీని వల్ల ప్రేరేపితమవుతాయి. అన్నాన్ని ఉడికించకముందు ధాన్యాల్లో బాసిల్లస్ సెరియస్ అని పిలువబడే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఇది సాధారణంగా వంట సమయంలో చావదు. మళ్లీ వేడిచేస్తే అనారోగ్యానికి ఇది కూడా కారణం కావచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన బియ్యంలో ఈ అంశాలు పెరుగుతాయి. ఎక్కువ సమయం వేడి చేస్తే వాంతులు, విరేచనాలు కలిగించి ఆహారాన్ని విష మయంగా మారుస్తాయి.

గుడ్లు :

గుడ్డులో ప్రధానంగా సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది. దీని వల్ల వాంతులు, పొత్తికడుపు నొప్పి, అతిసారం, జ్వరం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. గుడ్లు సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయనప్పుడు, ఈ వ్యాధికారక క్రిములు వేగంగా పెరుగుతాయి. ఆహారంలో ఉండే ఈ బ్యాక్టీరియా, వ్యాధికారక కారకాలు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.