హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి కరోనా వైరస్… ఆఫీసులన్నీ ఖాళీ

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి కరోనా వైరస్… ఆఫీసులన్నీ ఖాళీ

హైదరాబాద్ లోని ఓ సాప్ట్ వేర్ ఉద్యోగినికి కరోనా వైరస్ సోకింది. హైటెక్స్ లోని మైండ్ స్పేస్ లో… బిల్డింగ్ నెంబర్ 20లోని 9వ ఫ్లోర్ లోఉన్న DSM కంపెనీలో ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటీవ్ నమోదైంది. దీంతో ఆ కంపెనీతో పాటు బిల్డింగ్ లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటినుంచి పనిచేయమని పంపించేశారు. దాదాపు మూడు వేల మంది ఇంటికి వెళ్లిపోయారు. కంపెనీ యాజమాన్యం చెప్పేవరకు ఆఫీస్ కు రావద్దంటూ ఆర్డర్స్ జారీచేశాయి పలు కంపెనీలు. దీంతో మైండ్ స్పేస్ పరిసరాలన్నీ భయంతో వణికిపోతున్నాయి.

ప్రస్తుతం మైండ్ స్పేస్ లోకి ఎవరిని కూడా వెళ్లనీయడంలేదు. పొద్దున ఆఫీస్ కు వచ్చినటువంటి ఉద్యోగులను కూడా ఇంటికి పంపించారు. కరోనా భయంతో టెస్ట్ లు చేయించుకోవడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గాంధీ హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు టెస్ట్ చేయించుకున్న వారిలో 45మందికి నెగెటీవ్ రిజల్ట్స్ వచ్చాయి. దీంతో వారిని హాస్పిటల్ నుంచి డిచ్చార్జ్ చేశారు. అయితే వారిని బయట తిరగవద్దని సూచనలు చేశారు డాక్టర్లు.  కరోనా నియంత్రణకు గాంధీ, చెస్ట్, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశారు. దేశంలో ఇప్పటి వరకు 28కేసులు పాజిటీవ్ గా నమోదయ్యాయి. కరోనా నియంత్రణపై ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ 3గంటలకు పైగా జరిగింది. రాష్ట్ర సర్కార్ అలర్టయి తగు చర్యలు తీసుకుంటుంది. కరోనా వలన… ప్రధాని మోడీ కూడా హోలీ పండుగను జరుపుకోవడంలేదని తెలిపారు.

కరోనా వైరస్  హెల్ప్ నెంబర్ : 104, 040-24651119