దునియాల బెస్ట్​ హోటల్​ కేసా ఫార్చునేటో

దునియాల బెస్ట్​ హోటల్​ కేసా ఫార్చునేటో

పాత కాలం ఫర్నీచర్​, అందంగా ముస్తాబు చేసిన హాళ్లు, చూడంగనే కంట్ల ముద్రపడిపోయే సీలింగులు, సకల హంగులు.. అన్నీ కలిసి ఆ హోటల్​ను ప్రత్యేకంగా నిలిపాయి. ప్రపంచంలోనే ఉత్తమ హోటల్​ను చేశాయి. ఆ హోటల్​ లిస్బన్​లోని కాసా ఫార్చునేటో. ఆంటోనియో ఫాల్కవో కోస్టా లోప్స్​, ఫిలిపా ఫార్చునేటో అనే దంపతులు ఆ హోటల్​ను నడుపుతున్నారు. బయట చూడ్డానికి మామూలుగానే కనిపించినా లోపలికి వెళితే ఆ హోటల్​ హంగులు తెలుస్తాయి. అందుకే ఏటా బెస్ట్​ హోటళ్లను ఎంపిక చేసే మిస్టర్​ అండ్​ మిసెస్​ స్మిత్​ ఫౌండేషన్​, ఈ సారి కాసా ఫార్చునేటోను బెస్ట్​ స్మిత్​ హోటల్​ను ఎంపిక చేసింది. అక్టోబర్​ 10న అమెరికాలోని లాస్​ ఏంజిలిస్​లో జరిగిన కార్యక్రమంలో బెస్ట్​ హోటల్​గా దానిని స్మిత్​ ఫౌండేషన్​ ప్రకటించింది. చిన్న టౌన్​లో ఓ మామూలు ఫ్యామిలీ నడుపుతున్న ఈ ఇంటి లాంటి హోటల్​ చాలా అందంగా, కుటుంబ సమేతంగా వచ్చేలా ఉందని స్మిత్​ ఫౌండేషన్​ ఓనర్​ జేమ్స్​ లోహన్​ చెప్పారు. వివిధ కేటగిరీల్లోనూ మంచి హోటళ్లను ఎంపిక చేశారు.

  •     బెస్ట్​ స్మిత్​ హోటల్​– కేసా ఫార్చునేటో, లిస్బన్​, పోర్చుగల్​
  •     బెస్ట్​ డ్రెస్డ్​ హోటల్​– పలాజో డేనియిలి, పుగ్లియా, ఇటలీ
  •     వరల్డ్స్​ సెక్సీయెస్ట్​ బెడ్రూం– జోలీ, మాల్దీవులు
  •     బెస్ట్​ డేట్​ నైట్​ బార్​– మైసన్​ డి లా లుజ్​, న్యూ ఓర్లీన్స్​, లూసియానా
  •     బెస్ట్​ స్మిత్​ విల్లా– ఉషువా అల్మా కేసా ఆండర్సన్​, బహియా, బ్రెజిల్​
  •     మోస్ట్​ స్పాయిలింగ్​ స్పా – యుఫోరియా రిట్రీట్​, మిస్త్రాస్​, గ్రీక్​
  •     బెస్ట్​ బడ్జెట్​ బోటిక్​– సాండ్స్​ హోటల్​ అండ్​ స్పా, పామ్​ స్ప్రింగ్స్​, కాలిఫోర్నియా
  •     బెస్ట్​ ఫ్యామిలీ హోటల్​– దతాయ్​ లంక్వాయి, మలేసియా
  •     కూలెస్ట్​ క్రియేటివ్​ హబ్​– లోటెల్​ ఎట్​ డోస్​ 18 కాన్సెప్ట్​ హౌస్​, శాన్​ మిగ్వెల్​ డి అలెండె, మెక్సికో
  •     లోకల్​ హోటల్​ హీరో – సాల్ట్​ ఆఫ్​ పామర్​, మారిషస్​