
మెదక్ టౌన్, వెలుగు : సోషల్డిస్టెన్స్ పాటించకుండా మటన్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు హవేళి ఘనపూర్ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని బూర్గుపల్లిలో ఆదివారంఉదయం మటన్ దుకాణాల వద్ద దూరం పాటించకుండా ప్రజలు గుమిగూడేలా చేసిన మటన్ వ్యాపారులు వాజిద్, వహీద్‌పై కేసు నమోదు చేసినట్లుపేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో గుమిగూడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే వ్యాపా రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.